Sunday, December 22, 2024

నన్ను హత్య చేసేందుకు కుట్ర: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లో ఉంటే.. గులాబీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. నిన్న అరికెపూడి గాంధీపై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అరికెపూడి. ఇవాళ హైదరాబాద్ లోని కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో వెళ్లి ఆయన ధర్నాకు దిగారు.

అయితే.. గాంధీ అనుచరులు, కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు, గుడ్లు, టమోటాలతో దాడి చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి అద్దాలు, ఇంట్లో పూలకుండీలు ధ్వంసం చేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద బైఠాయించిన అరికెపూడి గాంధీ.. తన అనుచరులతో కలిసి నిరసనకు దిగారు. కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలని.. తాను ఇక్కడే ఉంటానని హెచ్చరించారు. దీంతో కౌశిక్‌ రెడ్డి ఇంటి దగ్గర టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుచేసేందుకు పోలీసులు గాంధీని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News