Monday, January 20, 2025

నిరుపేద విద్యార్థినికి ఎంఎల్ఎ ఆరూరి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

మామునూరు(సంగెం): నిరుపేద విద్యార్థినికి ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చేయూతనందించింది. గ్రేటర్ వరంగల్ 43, 44 డివిజన్ల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పసునూరి కుమారస్వామి కూతురు పసునూరి గ్రీష్మ ఎన్‌ఐటి నాగ్‌పూర్‌లో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా కళాశాల ఫీజు చెల్లించేందుకు తగిన ఆర్థిక స్తోమత లేక ఎంఎల్ఎ ఆరూరి రమేశ్‌ని ఆర్థిక సాయం చేయాలని కొరగా వెంటనే స్పందించిన ఎంఎల్ఎ ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని అందచేశారు. దీంతో అడిగిన వెంటనే తమకు సాయం అందించిన ఎంఎల్ఎ ఆరూరి రమేశ్‌కు విద్యార్థిని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News