Monday, December 23, 2024

మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరూరి శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో రూ. 30 లక్షలు, ఆరెపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి బిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ శంకుస్థాపన చేశారు. హసన్‌పర్తి 66వ డివిజన్ ఆర్టీసీ కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి భవ్య ఆలయ శంకుస్థాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఆర్టీసీ కాలనీ వాసులు చాలా చక్కటి కార్యక్రమం చేపట్టారని, ఎల్లవేళలా అండగా ఉంటానని, సీతారామచంద్రస్వామి కృప కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, కార్పొరేటర్ జన్ను శిభారాణి అనిల్, డివిజన్ ప్రెసిడెంటు నేరెళ్ల రాజు, పీఏసీఎస్ ఛైర్మన్ ఇట్యాల హరికృష్ణ, 66వ డివిజన అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, ఆత్మ జిల్లా ఛైర్మన్ కందుకూరి చంద్రమోహన్, మాజీ కార్పొరేటర్ వీర బిక్షపతి, సీనియర్ నాయకులు పిట్టల కుమారస్వామి, ఇమ్మడి రాజేందర్, దీకొండ బిక్షపతి, పెద్దమ్మ శ్రీనివాస్, గరిగె మురళి, నలిగేటి అనిల్‌కుమార్‌యాదవ్, ముదిరాజ్ సంఘం కార్యదర్శి పెద్దమ్మ శ్రీనివాస్, కేదాసి రాకేష్, జాగృతి వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు మేకల రాజేందర్, ఉపాధ్యక్షుడు ఆరెపల్లి శ్రావణ్, యూత్ నాయకులు వేల్పుల సాయికుమార్, అరుణ్, కందుకూరి సాయిచందు, కాజీపేట అన్నమాచార్య, డివిజన్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News