Sunday, December 22, 2024

ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని వర్ధన్నపేట నియోజకవర్గ ఎంఎల్‌ఎ, వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం హనుమకొండ హంటర్‌రోడ్డులోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో హసన్‌పర్తి మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో టిఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా ఎంఎల్‌ఎ ఆరూరి మాట్లాడుతూ.. మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి సమిష్టి నిర్ణయాలతో పార్టీ పటిష్టానికి కృషి చేయాలని వివరించారు. ఈకార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News