Monday, December 23, 2024

ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా ఎమ్మెల్యే ఆరూరి

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు వరంగల్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అండగా నిలిచారు. బుధవారం గ్రేటర్ వరంగల్ పరిధి 56వ డివిజన్‌లోని జవహర్ నగర్ కా లనీలోని ముంపు ప్రాంతాల ప్రజలకు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్వయంగా ఇంటింటికి వెళ్లి వరద బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారికి ఎల్లపుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్‌కుమార్, డివిజన్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు మణీంద్రనాథ్, మాజీ కార్పొరేటర్లు జక్కుల వెంకశ్వర్లు, రాజునాయక్, డివిజన్ నాయకులు చింత రమేశ్‌గౌడ్, సాంబ య్యనాయక్, లోకిని చందర్, పులి రాజేష్, దూలం రాజేందర్, కందుకూరి మహేందర్, కల్యాణ్‌నాయక్, ఆరెపల్లి రాజు, అభిషేక్, సందీప్, శ్రీకాంత్, రామ్‌కీ, పెసరు శ్రీనివాస్‌రెడ్డి, శరత్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News