Thursday, December 26, 2024

కెటిఆర్‌కు లంబాడీలు, గిరిజనులపై కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది?

- Advertisement -
- Advertisement -

కెటిఆర్‌కు లంబాడీలు, గిరిజనులపై కొత్తగా ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కనిపించని గిరిజనులు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారో అర్ధం కావడం లేదని దేవరకొండ, ఎమ్మెల్యే బాలు నాయక్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కెటిఆర్ మాయమాటలు చెప్పి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. సిఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కెసిఆర్ అనేక తప్పుడు హామీలు ఇచ్చి బడుగు బలహీన వర్గాలను వంచించారన్నారు. అందుకే బిఆర్‌ఎస్ పార్టీని గత ఎన్నికల్లో గిరిజనులు బొందపెట్టారన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్ చిత్తుగా ఓడిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నుంచి గిరిజనులను వేరు చేయడానికే కెటిఆర్ కుట్రలు చేస్తున్నారన్నారు.

కెటిఆర్ కుతంత్రాలు ఏమిటో తమ గిరిజన బిడ్డలకు తెలుసనీ, లగచర్ల దాడి కేసులో అరెస్టు అయిన వారిలో ఏడుగురు మాత్రమే గిరిజనులున్నారని ఆయన తెలిపారు. కొడంగల్ పారిశ్రామిక వాడ కోసం తీసుకునే భూమిలో 11 శాతం మాత్రమే గిరిజనులదని, ఆ గిరిజనులకు మెరుగైన పరిహారంతో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. అమాయక గిరిజన బిడ్డలను రెచ్చగొట్టి జైలు పాలు చేసే కుట్ర బిఆర్‌ఎస్ చేసిందన్నారు. సంగారెడ్డి జైలులో లగచర్ల నిందితులు కెటిఆర్‌ను నిలదీశారని ఆయన ఆరోపించారు. లంబాడీలను అడ్డం పెట్టుకొని కెటిఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. సిఎం రేవంత్ రెడ్డి పైన అక్కసుతోనే కెటిఆర్ ధర్నాలు చేస్తున్నారని, కొడంగల్ లో ఘటన జరిగితే మహబూబాబాద్‌లో కెటిఆర్ ధర్నా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News