Monday, December 23, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఓటు హక్కును జడ్ పి కార్యాలయం సమావేశం మందిరంలో వినియోగించుకున్నారు. గద్వాల జిల్లా  పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంటనే ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్, జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News