నల్లగొండ:ప్రభుత్వ జూనియర్ కళాశాల నాగార్జునసాగర్‌కు చెందిన విద్యార్థి మేరావత్ బాలచందర్ ఐఐటీ ఖరగ్ పూర్‌లో సీట్ పొందడం అభినందనీయమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్‌కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా క్యాంపు కార్యాలయంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు పొందిన మే రావత్ బాలచందర్‌ను అభినందించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు ప్రఖ్యాత విద్యాసంస్థ ఐఐటీ వ ంటి సంస్థల లో ఉన్నత చదువులు చదివేందుకు సీట్లు పొందడం అభినందనీయమని అన్నారు. నాగార్జునసాగర్ వంటి మారుమూల గ్రామీణ ప్రాంత కళాశాలలో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్న ప్రధానాచార్యులు, అధ్యాపకులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషిచేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్దీకరించిందని తద్వారా మరింత నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని, నియోజకవర్గంలో విద్యార్థులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు పాండయ్య, అధ్యాపకులు చి ంతపల్లి వెంకటయ్య, ప్రసన్నలక్ష్మీ, ఉపేంద్రచారి, యాదగిరి, సోమయ్య, మజీద్ అలీ, కవిత తదితరులు ఉన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు పొందిన మేరావత్ బాలచందర్‌కు యన్‌సీయం ఫౌండేషన్ తరుపున ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.