Friday, January 24, 2025

టిటిడి భూముల రిజిస్ట్రేషన్ పై ఎంఎల్‌ఎ భూమన వివరణ

- Advertisement -
- Advertisement -

 

తిరుపతి: భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిషేధిత జాబితా (22ఎ)పై ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. గత ఐదు రోజులకు ముందు భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొంత మంది తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. బాధ్యత కలిగిన ఎంఎల్‌ఎగా వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడానని తరువాత వారు టిటిడి అధికారులు జిల్లా రిజిస్ట్రార్‌కు తగిన అదేశాలు ఇచ్చారన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కొంత మంది నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. సమస్య వేగవంతంగా పరిష్కారం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News