Thursday, January 23, 2025

సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

- Advertisement -
- Advertisement -

రాజోలి: అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అలంపూర్ ఎమ్మెల్యే డా.వి.ఎం. అబ్రహం పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన రాజోలిలో ఆదివారం రూ. 13 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది అని , దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. దేశ ప్రజలు కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా మారిందని, రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు. యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసిఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్ధేశం చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, రాజోలి గ్రామ ఉప సర్పంచ్ గోపాల్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాంరెడ్డి, గంగిరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్లు, నిషాక్, ఇతర గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News