Thursday, January 23, 2025

నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

- Advertisement -
- Advertisement -

కల్హేర్: మండల కేంద్రమైన కల్హేర్‌లో నూతనంగా మంజూరైన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్హేర్‌కు ఏడు ఏళ్ల నుంచి చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు. కల్హేర్‌కు మిషన్ భగీరథ ద్వారా రూ.కోటి 20లక్షలు, సిసి రోడ్లుకు రూ.కోటి 50లక్షలు, నూతన 30 పడకల ఆసుపత్రికి రూ.5కోట్ల 60లక్షలు, నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.2కోట్ల 50లక్షలు, మిషన్ కాకతీయ ద్వారా గ్రామంలోని అన్ని చెరువులకు రూ.2కోట్లు, మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా స్కూళ్లకు రూ.కోటి 50 లక్షలు, గంగపుత్ర, విశ్వకర్మ, లింగాయత్ కమ్యూనిటీ భవన నిర్మాణాలకు రూ.20లక్షలు, కల్హేర్ నుంచి పోమ్యనాయక్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల 20లక్షలు, నల్లవాగుపై నూతన చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.కోటి 50లక్షలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఈ గ్రామానికి రూ.20కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి చేశామన్నారు. గ్రామంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రజలకు ఎంతో సహయం చేస్తున్నామన్నారు. మరోసారి సిఎం కెసిఆర్‌ను నన్ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలోఆత్మచైర్మన్ రాంసింగ్, జడ్పిటిసి నర్సింహారెడ్డి, ఎంపిపి సుశీల అంజయ్య, జిల్లా కోఆప్షన్ డాక్టర్ అలీ, వైస్ ఎంపిపి నారాయణరెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ యువత అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ముదిరాజ్, సర్పంచులు లచ్చవ్వబాలయ్య, కృష్ణారెడ్డి, రాములునాయక్, ఎంపిటిసి సంగప్ప, ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్, ఉప సర్పంచ్ సాయిలు, కోఆప్షన్ గనీ, సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పండరి, స్కూల్ చైర్మన్ బాలయ్య, బిఆర్‌ఎస్ నాయకులు హన్మంతురావు, వెంకట్‌రెడ్డి, నర్సింహాగౌడ్, యువ నాయకులు సాయిబాబా,పండరి, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News