Monday, December 23, 2024

ముదిరాజ్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని సంజీవన్‌రావుపేట్‌లో రూ.10లక్షలతో నిర్మించనున్న ముదిరాజ్ భవనానికి గురువారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. అలాగే ముత్యాల పోచమ్మ ఆలయం వద్ద రూ. 1.50లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎ మ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, ఎంపిపి తనయులు కర్ర రమేష్ చౌహాన్, సిర్గాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సంజీవన్‌రావు పాటిల్, మ ండల పార్టీ మాజీ అధ్యక్షుడు సాయిరెడ్డి, ఎంపిటిసి భూపాల్, గ్రామ సర్పంచ్ ఎంబరి విఠల్, ఉప సర్ప ంచ్ సద్గుణ విఠల్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోచ య్య, నాయకులు దస్తన్న, తదితరులు పాల్గొన్నారు.

డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కల్హేర్‌లో… మండలంలోని మాసన్‌పల్లి రోడ్డు నుంచి సిర్గాపూర్ వరకు రూ.15కోట్లతో నిర్మిస్తున్న డబుల్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి రాథోడ్ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, ఎంపిపి తనయులు రమేష్ చౌహాన్, మండల పార్టీ అధ్యక్షుడు సంజీవన్‌రావు పాటల్, గంగాపూర్ పిఎసిఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచులు బల్‌రాం, రాజు, బిఆర్‌ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు అంజాగౌడ్, నాయకుడు మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News