Sunday, January 19, 2025

ఎస్సి కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

- Advertisement -
- Advertisement -

మనూర్: మనూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో రూ.5లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సి కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఫ్రభుత్వాలు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడకున్నాయన్నారు. నేడు సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య అందాలని హాస్టల్ వసతితో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి కొంగరి జయశ్రీమోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌రావు, సర్పంచ్ బీమా, డీలర్ మోహన్‌రావు, గ్రామ పార్టీ నాయకులు శీను, నర్సింలు, తదితరులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News