Monday, December 23, 2024

దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

- Advertisement -
- Advertisement -

కోయిలకొండ: మండల కేంద్రంలోని మహిమాన్వితమైన ఆది ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ఆదివారం నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయంలోని స్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వేద పండితుల మంత్రం శరణుల మధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రూ. 50 లక్షలతో దేవాలయాల నిర్మాణాన్ని నిర్మించడం జురుగుతుందని అద్నరు.

దేవాలయ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని త్వరలోనే దేవుడి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీంరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు విజయభాస్కర్‌రెడ్డి, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ మల్లయ్య, ఎంపీటీసీలు ఆంజనేయులు, రోజా జగన్, నాయకులు భీంరెడ్డి, నారాయణ , రవీందర్, శ్యాంసుందర్, మీరా , గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు , సభ్యులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News