Monday, December 23, 2024

ఆర్డిఎస్ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

- Advertisement -
- Advertisement -

అయిజ : మండల పరిధిలోని సింధనూరు గ్రామంలో ఆర్డిఎస్ 42 నుండి 65 కిలో మీటర్ల వరకు కటింగ్,షీల్డ్ , స్ట్రక్చర్స్ పనులకు రూ.82 లక్షల తో ఎమ్మెల్యే విఎం అబ్రహం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

రైతులకు వ్యవసాయానికి నిరంతరం ఉచిత కరెంట్,రైతు బంధు,రైతు బీమా,రుణ మాఫి పథకాలను అమలు చేసిందన్నారు.ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. దీని ద్వారా 25 ఎకరాలకు రైతుల సాగునీరు అందనుందన్నారు.ప్రభుత్వం రూ.368 కోట్ల నిధులను మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని రైతుల నుండి భూ సేకరణ ప్రారంభమైందని రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు,బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News