Saturday, November 9, 2024

ఒలింపిక్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్‌ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎంఎల్‌ఏ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ రన్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. ఒలింపిక్స్‌ను పూర్తిగా ఒలింపిక్స్ గేమ్స్‌పై అవగాహన పెంచేవిధంగా రన్ ప్రారంభించారని తెలిపారు. ఒలింపిక్ రన్‌తో ప్రజల మానసికంగా , ఆరోగ్యంగా ధృ ఢంగా ఉంటారని, యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఒలింపిక్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ ఒలింపిక్ పెద్దబజార్ రోడ్డు మీదుగా ఉష్ క్రీడాకారులతో నెహ్రూ పార్క్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు సాగింది. అనంతరం జిలాల ఒలింపిక్ అధ్యక్షుడు ఈగ సంజీవ్‌రెడ్డికి అందజేయడం జరిగింది. ఈ ఒలింపిక్ రన్‌ను ఘనంగా విజయవంతం చేయడంపట్ల క్రీడాకారులకు, విద్యార్థులకు, పాఠశాలల యాజమాన్యాలకు, వ్యాయామ ఉపా ధ్యాయులకు , క్రీడా సంఘాలబాధ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగాజాతీయ క్రీడల్లో రాణించిన క్రీడా కారులను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ కార్యదర్శి బొబిలి నర్సయ, ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్, భక్తవత్సలం, ప్రవీన్‌రెడ్డి, కోశాధికారి భూమారెడ్డి, టిఎన్‌జిఓ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కార్యదర్శి శేఖర్, సంయుక్త కార్యదర్శి రాజాగౌడ్, ఉషు రాష్ట్ర కార్యదర్శి ఓమర్, గోపిరెడ్డి, రత్నాల రాజుగౌడ్, సెపక్‌తక్రా రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి గాదారి సజీవ్‌రెడ్డి, డేవిడ్, ప్రశాంత్, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News