సూర్యపేట:గిరిజనులు సంప్రదాయం ప్రకారం ఆషాడ మాసంలో తొలకరి విత్తనాలు వేసిన తర్వాత సీత్లా (తీజ్) పండుగను అంగరవంగ వైభవంగా నిర్వహిస్తారని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని మంగళ్ తండాలో గిరిజనుల ఆరాధ్యదైవం సీత్లాభవాని పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గిరిజనులు పంటలు పుష్కలంగా పండాలని, పశు సంపద పెరగాలని, అటవీ సంపద పెరగాలని, ఎవరూ రోగాల భారిన పడకుండా అందరూ బాగుండాలని జరుపునే ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లి సీత్లా దేవి పండుగను ప్రతి ఏటా ఐకమత్యంతో జరుపుకోవడం ఆనవాయితీ వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు వెంపటి మధుసూదన్, గ్రామ సర్పంచ్ రమావత్ పద్మ జబ్బార్, ఉప స ర్పంచ్ వాసు, గ్రామ పాలకవర్గ సభ్యులు సావిత్రి, నాగ, లచ్చు, యువత, అధ్యక్షులు సింహాద్రి, వీరయ్య, గ్రామ పెద్దకాపు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.