- Advertisement -
గాంధీనగర్ : అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరు కాకూడదని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్‌కు చెందిన విజాపూర్ నియోజక వర్గం ఎమ్‌ఎల్‌ఎ సీజే చావ్లా శనివారం పార్టీకి రాజీనామా చేశారు. జనవరి 22న రాముడి ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మొదట నుంచీ ఆయన వ్యతిరేకిస్తున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేశానని, అయితే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశం మొత్తం హర్షిస్తుంటే కాంగ్రెస్ మాత్రం వెళ్లకూడదని నిర్ణయించడం తనకు బాధ కలిగిందని , అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి సమర్పించారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో కాంగ్రెస్ సంఖ్య 15 కి పడిపోయింది. చావ్లా బీజేపీలో చేరతారని భావిస్తున్నారు.
- Advertisement -