Monday, December 23, 2024

జర్నలిస్టుల కాళ్లు విరగగొట్టి తోలు తీస్తా: చెవిరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తనపై సోషల్ మీడియాలో వార్తలు రాస్తే తోలు తీస్తౠ, ఇంటికి వచ్చి కాళ్లు, చేతులు విరగగొడుతానని వైసిపి ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విలేఖర్లను బెదిరించారు. తిరుపల్లి పట్టణంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉందని మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఎంఎల్‌ఎ మీడియా సమావేశం కావడంతో 15 జర్నలిస్టులు అక్కడికి వెళ్లారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకోనని భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.

తనపై వార్తలు రాస్తే జర్నలిస్టుల ఇంటికి వచ్చి కాళ్లు చేతులు విరగగొడుతానని బెదిరింపులకు దిగారు. ఏడేళ్లు నక్సలైట్‌గా పని చేసి వచ్చానని, సోషల్ మీడియాలో తన కుమారుడు, తనపై వ్యతిరేకంగా పోస్టులు చేస్తే తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తానని చెవిరెడ్డి హెచ్చరించారు. ఇద్దరు జర్నలిస్టుల పేర్లు బయటకు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశానని, అని వివరాలు తను తెలుస్తాయని చెవిరెడ్డి వివరించారు. తనకు పని ఉందంటూ తన కుమారుడ మోహిత్ రెడ్డి వెంట పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News