- Advertisement -
కాసిపేటః కాసిపేట మండలంలోని లంబాడితండా(కె) పంచాయితీ పరిధిలోని లంబాడితండా ఉన్నత పాఠశాలను శుక్రవారం మద్యాహ్నం బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య అకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో వసతులపై ఆరా తీసారు. విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్న భోజనం పథకం తీరును పరీశీలించారు. విద్యార్థులకు వండి పెట్టె బియ్యం ను వంటశాలలో పరీశీలించారు.
అలాగే లంబాడితండా పాఠశాల మన ఊరు మన బడి లో ఉండగా సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు. మన బడి ద్వారా మంజురు అయిన పలు పనులు నిర్మాణంలో ఉండగా వాటిని పరీశీలించారు. కట్టడాలు నాణ్యతతో ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థులకు మంచి భోజనం అందించాలని వంట నిర్వహాకులకు సూచించారు. ఉపాద్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఆయన సూచించారు.
- Advertisement -