రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ను పురస్కరించుకుని మండలంలోని సూరారం,బి తుర్కపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పల్లె ప్రగతి ఉత్సవాలలో పాల్గొని పలు అభివృధ్ది పనులను ప్రారంభించారు. సూరారం గ్రామంలో 10లక్షలతో సిసి రోడ్డు పను లు జగ్గన్న బావి ఎక్స్‌రోడ్డు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. బి తుర్కపల్లిలో 20లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనం ,10లక్షలు వె చ్చించి నిర్మాణ పనులు ,బి తుర్కపల్లి ,మూసి రోడ్డు మరమ్మత్తు పనులకు ఎమెమమల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయితి సిబ్బంది కి బహుమతులు అందించి, సన్మానించి ,లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పల్లెలు ప్రగతి పల్లెలు గా దేశంలో రికార్డు సృష్టిస్తున్నాయని , పేద ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఏ నాయకు డు చేయని విదంగా సిఎం కెసిఆర్ చేస్తున్నారన్నా రు. రైతును రాజును చేయాలన్నదే కెసిఆర్ లక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కన్నెబోయిన జ్యోతి బలరాం, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి , మార్కెట్ వైస్ చైర్మన్ కంభం పాటి శ్రీనివాస్ , రైతు సమన్వయ స మితి మండల అధ్యక్షులు బొక్క మాధవరెడ్డి, టిఆర్‌ఎస్ మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం, స ర్పంచులు పోలెబోయిన అండాలు , చెరుకు సోమ య్య, బొక్క కృష్ణవేణి,ఎంపిటిసిలు దోమల సతీష్,ఎండి ఆమీర్ నాయకలు పున్న జగన్మోహన్, ఉప సర్పంచులు సుదాకర్‌రెడ్డి, నగేష్,గ్రామ శాఖ అధ్యక్షు డు జినుకల మల్లేష్, నాయకులు చిట్టిమల్ల అంజయ్య, పోతరాజు సాయి, బం దెల రవి, దోమల గణే ష్,జింకల నాగరాజు, బందెల నరేష్, తోటకూరి మచ్చగిరి, మల్లేశం, జోగు స త్యనారాయణ ,అమరేందర్‌రెడ్డి, శివరాత్రి కుమార్, కల్లూరి నరేష్,బాసాని రాజు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.