Thursday, January 23, 2025

కల్వకుర్తి ప్రింట్ మీడియా కమిటీని అభినందించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి టౌన్ : నూతనంగా ఎన్నికైన కల్వకుర్తి ప్రింట్ మీడియా అసోసియేషన్ కార్యవర్గాన్ని గురువారం కల్వకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అభినందించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రింట్ మీడియా అధ్యక్షుడు వెం కటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పా టు కార్యవర్గాన్ని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ చైర్మన్ శ్రీశైలంలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టు అసొసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో ప్రింట్ మీడియా అసోసియేషన్ ఉపాధ్యక్షు లు, కార్యదర్శులు, కోశాధికారి, పిఆర్‌ఓ, ప్రధాన కార్యదర్శితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News