Saturday, December 21, 2024

దానంపై అనర్హత వేటు వేయాలి: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల బృందం కలిసింది. కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని సభాపతిని కోరామని ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి తెలిపారు. దానంపై చర్యలు తీసుకుంటామని సభాపతికి హామీ ఇచ్చారన్నారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎ అనర్హత వేటుపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కౌశిక్ డిమాండ్ చేశారు. మూడు నెలల్లో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడుతుందని, తాము ఇంకా గేట్లు తీయలేదని, తాము గేట్లు తీస్తే కాంగ్రెస్ నాయకులు భూస్థాపితం అవుతారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News