Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్ఎలు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో 20 మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే చేరనున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జోస్యం చెప్పారు. గులాబీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఎద్దేవా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, కెటిఆర్‌లు తప్ప బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్‌లోకి వస్తారని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నేత కెసిఆర్ విధానాలే ఆ పార్టీని ముంచాయని దానం ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని దానం చెప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌ల చేరిక త్వరలో ఉంటుందని దానం వెల్లడించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో కొందరు బిజెపిలోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారని దానం నాగేందర్ వెల్లడించారు. అయోమయంలో పడిన బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడాలనుకుంటున్నారని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News