Friday, November 22, 2024

ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆరునెల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. బంజారాహిల్స్ లో 2012లో కారుకు అడ్డు వచ్చిన ఓ పోలీసుపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్ తోపాటు చట్నీ రాజు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి అభియోగపత్రం బదిలీ అయింది.విచారణ జరిపిన ప్రజా ప్రతినిధుల కోర్టు దానం నాగేందర్‌పై ఐపిసి 323 సెక్షన్ కింద అభియోగాలు రుజువైనట్లు ప్రకటించింది. దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించిన కోర్టు జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. ఈక్రమంలో అప్పీలు చేసుకునేందుకు వీలుగా దానం నాగేందర్‌పై శిక్షను నెల రోజుల పాటు అవకాశం ఇస్తున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది.

MLA Danam Nagender sentenced to 6 months jail ​

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News