సూర్యాపేట:కోదాడ మండల పరిధిలోని గణపవరం స్టేజి దగ్గర వేంచేసిన గంగమ్మ తల్లికి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు రాష్ట్రంలో జరిగే జా తరలను పట్టించుకున్న నాధుడే లేరన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతరలకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించిందన్నారు.
మతాలకు అతీతంగా ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడమనేది తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు కుర్రి హనుమంతరావు, మాజీ ఎంపిటిసి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీను, నాగరాజు, కుర్రి వెంకన్న, వెంకటేశ్వర్లు, భూషణం, యాదవ కుల పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.