Sunday, December 22, 2024

మహిళా సంఘాలకు చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

కల్హేర్‌: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఎస్‌హెచ్‌జీ మహిళ సంఘాలకు సున్న వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సంఘాల మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మండలంలోని 490 గ్రూపులకు రూ.1,22,30,000ల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో మహిళలు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రపు సుశీల అంజయ్య, జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్మ్రావత్ రాంసింగ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గారెడ్డి, బాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సంగారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఘనీ, ఎంపీపీ తనయులు జలెందర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, బీఆర్‌ఎస్‌పార్టీ అధ్యక్షులు విఠల్‌రావు, మండల నాయకులు, అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News