- Advertisement -
హాజీపూర్: జిల్లాలోని హాజీపూర్ మండలంలోని దొనబండ, పెద్దంపేట, గొల్లపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని గిట్టుబాటు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -