Saturday, November 23, 2024

గ్రామ పంచాయతీ కార్యాలయాలన్ని ప్రారంభించిన ఎంఎల్‌ఏ దుద్దిళ్ల

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం: మహాదేవపూర్ మండలంలోని అన్నారం నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మాజీ మంత్రి, ఏఐసిసి కార్యదర్శి, మంథిని ఎంఎల్‌ఏ దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వలన ప్రతి సంవత్సరం మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్, బ్యాక్ వాటర్ వలన అధిక మొత్తంలో నష్టం జరుగుతున్న రైతులను ఆదుకోవడంలో కెసిఆర్ ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. మన భూములను త్యాగం చేసి ఉపాధి కోల్పోవడం జరిగిందని, అయినప్పటికి మన ప్రాంత రైతులకు ఎలాంటి లాభం చేయకుండా మన ప్రాంత ఇసుకను అమ్ముకొని ప్రభుత్వ ఖజానాను నింపుకుంటున్నారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వలన కేవలం మంథని రైతాంగ సోదరులకు మాత్రమే నష్టం జరుగుతుందని, మంథని ప్రాంతానికి ప్రత్యేక ప్యాకెజి కావాలని, గత మూడు, నాలుగు సంవత్సరాల నుండి నష్టపోతున్న రైతాంగ సోదరులకు వెంటనే ముంపుకు గురవుతున్న పంటలపై సర్వే నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు నష్టపరిహారాన్ని చెల్లించి వాళ్ళకు న్యాయం చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతమైన కాటారం, మహాదేవపూర్, మలహార్, మహాముత్తారం మండలాలకు సంబంధించి, కాటారం హెడ్‌క్వార్టర్‌లో ఆర్‌డిఓ ఆఫీస్‌ని, న్యాయస్థానాన్ని నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News