సిటిబ్యూరోః ఆరిజిన్ డెయిరీ సీఈఓ బోడపాటి శేజల్ మరోసారి జూబ్లీహిల్స్‌లో ఆత్మహత్యకు యత్నించింది. నిద్రమాత్రలు మింగిన శేజల్ పెద్దమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన గురువారం పడి ఉండడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శేజల్‌ను అస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం….ఆదిలాబాద్‌కు చెందిన ఆరిజిన్ డెయిరీ సీఈఓ బోడపాటి శేజల్ గత కొంత కాలం నుంచి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేసింది. తర్వాత తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యకు యత్నించింది. నిద్రమాత్రలు మింగిన శేజల్‌ను మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పెద్దమ్మ గుడి వద్ద డ్రాప్ చేశారని స్థానికులు తెలిపారు. శేజల్‌ను ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు చికిత్స చేయిస్తున్నారు. ఆమె బ్యాగు నుంచి ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.