Thursday, December 26, 2024

అరెస్టు చేస్తారని ఎంపి, ఎంఎల్‌ఎలు భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేస్తారని ఎంపి, ఎంఎల్‌ఎలు భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో 41ఎ నోటీసు ఇవ్వాలని, నోటీసిచ్చి వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని అడిగారు. అరెస్టు చేస్తే బాధ్యుల పరిణామాలు ఎదుర్కొంటామని హైకోర్టు హెచ్చరించింది. బాధ్యులైన పోలీస్ అధికారి అరెస్టుకు ఆదేశాలిస్తామని హైకోర్టు వివరించింది. ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తేనే పరిస్థితి చక్కబడేలా ఉందని, వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. ఈ విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కావాలని ఎంఎల్‌ఎ సాంబశివరావు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీలు చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారని ఫ్యాక్టరీ యజమాని, ఎంఎఎ సాంబశివరావు, ఆయన అనచురులపై గనుల భూగర్భశాఖ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ 30వ తేదీన ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News