Wednesday, January 22, 2025

ఎంఎల్ఎ ఈటల వాహనానికి ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్  : మానకొండూరు మం.లలితాపూర్ గ్రామం వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగింది. చీకటి పడడంతో ఎదురుగా వస్తున్న గొర్రెల మందను చూసి డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఎస్కార్ట్ వాహనం ఈటల గారి వాహనానికి ఢీ కొట్టడంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. భగవంతుని దయ వలన ప్రజల ఆశీస్సులతో ఈటల గారితో పాటు అందరూ క్షేమంగా ఉన్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు వారికి నచ్చినట్టు తప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ వార్తలను పట్టించుకోవద్దు అని మనవి చేస్తున్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News