Monday, December 23, 2024

స్పీకర్‌ను అడ్డుపెట్టుకొని గొంతునొక్కుతున్నారు : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల ఎంఎల్‌ఎలకు మాట్లాడనివ్వకుండా శాసనసభలో అధికార పక్షం గంధరగోళం సృష్టిస్తోందని బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ విమర్శించారు. స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని మా గొంతు నొక్కుతున్నారని అన్నారు. శనివారం శాసనసభ వాయిదా అనంతరం ఈటల రాజేందర్, రఘనందన్‌రావులు మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి కెటిఆర్ చెప్పిన సమాధానం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కెటిఆర్ తన వాగ్ధాటితో వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు. సందర్భం వచ్చినపుడు మాటలు చెప్పి కాలం గడుపుకునేవారికి ప్రజలు బుద్దిచెబుతారన్నారు.

24 గంటలు కరెంట్ ఇస్తున్నామని అంతా అబద్దం చేప్పారని 2014 కంటే పూర్వం ఉన్న పరిస్థితే రాబోతోందని అన్నారు. ఉద్యోగుల జీతాలు సమయానికి ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. సభలో మంత్రి కెటిఆర్ వ్యక్తిగత ఆరోపణలు దిగారని, క్లారిఫికేషన్‌కు సభాపతి సమయం ఇవ్వడం లేదని రఘనందన్‌రావు విమర్శించారు. 2018 నాటి పాంప్లెంట్ తెచ్చి కెటిఆర్ మాట్లాడారని , 2014,2019లో మీ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదనేది తమకు వర్తిస్తుందని కెటిఆర్ గుర్తించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News