Friday, December 20, 2024

అక్కడ..ఇక్కడ పోటీ చేస్తా : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్‌తో పాటు గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గ బిజెపి మఖ్యకార్యకర్తలతో సమావేశంలో ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హుజురాబాద్ నియోజకవర్గం 119 నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచి… డబ్బులు లేకున్నా నాయకుడు కావచ్చు అని నిరూపించిందని ఆయన తెలిపారు. కులంతో, మతంతో సంబంధం లేకుండా నన్ను గెలిపించారు. తొలిసారి నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. నేను మీ బిడ్డను అని చెప్పిన. నేను 6 ఫీట్ల హైట్ లేకపోవచ్చు రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం నుంచి రాకపోవచ్చు కానీ మీ బాధలు తీర్చేవాడిని నేనే అని చెప్పాను. ఆనాటి ప్రభుత్వాలకు సోయి, సెన్స్ ఉండేవి.

ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్య న్యాయమైనదంటే దానిని పరిష్కరించేవారు. హుజురాబాద్‌ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపాను. హోదా ఉన్నవాడితో కొట్లాడతాం.. కానీ సైకోతో ఏం కొట్లడతాం.. ఎవరి చరిత్ర ఏంటో చెప్పుకోవాలి.. అంతిమంగా నిర్ణయించేది ప్రజలే అని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ మీద, హుజూరబాద్ నియోజకవర్గంలో పోటీ చేస్తా.. మీరు తలుచుకుంటే వేరే వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. ఎన్నికల వేళ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.ఈ నెల 16వ తేదీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ రాబోతున్నారు. ఆ సభను విజయవంతం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News