Monday, December 23, 2024

ఎంఎల్ఎ రాజాసింగ్‌తో ఈటల భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ.. బిజెపి కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బుధవారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని బిఆర్‌ఎస్ నేతలు దాడులు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఓ సర్పంచ్‌ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారని ఆరోపించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం పార్టీ అధిష్టానం పరిధిలో ఉందని వెల్లడించారు.రాజాసింగ్‌పై వేసిన సస్పెన్షను ఎత్తివేసేలా పార్టీ పెద్దలతో మాట్లాడతా‘ అని ఈటల తెలిపారు. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి నాయకులపై, కార్పొరేటర్‌లపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న విషయాన్ని రాజాసింగ్ ఈటల దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని ఈటల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News