Thursday, December 26, 2024

నేను పార్టీ మారలేదు..వాళ్లే గెంటేశారు: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ‘నేను పార్టీ మారలేదు, వాళ్లే నన్ను గెంటివేశారు, గెంటివేసిన వాళ్ళు మళ్లీ పిలిచినా పోను’ అని బిజెపి నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల మాట్లాడారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా భ్యాపీగా లేదని, ఇప్పటికీ జీతాలు రాలేదని అన్నారు. సంఖ్యాబలంతో అధికార పార్టీవారు గంటల సేపు మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టి మాయ చేయాలని చూశారని ఆయనన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి మోడిపై విమర్శలు చేశారని మళ్లీ దేశానికి ప్రధాని మోడీయేనని అన్నారు.

సగానికి పైగా సిఎం చెప్పే లెక్కలు తప్పని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. ఈటల పార్టీ మారుతున్నారని వైఎస్ హాయంలోనూ ఇలాగే ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇవాళ సిఎం నా పేరు ప్రస్తావన చెప్పగానే పొంగిపోను అని నా మీద చేసిన దాడి మరిచిపోనని ఈటల రాజేందర్ అన్నారు. సంకుచితంగా వ్యవహరించవద్దని నేనడిగిన వాటికి సమాధానం చెప్పినంత మాత్రాన పొంగిపోనని అన్నారు. టిఆర్‌ఎస్‌లో కూడ సైనికుడిలా పనిచేశానని, బిజెపిలో కూడా సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. మెస్ చార్జీల మీటింగ్‌కు పిలిస్తే తప్పకుండా వెళ్తానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News