Monday, December 23, 2024

దళితబంధు డబ్బులు తిన్న ఎంఎల్ఎలు వాపస్ ఇవ్వాలి: ఈటల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 2 లక్షల కోట్లతో ఒక్కొ దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానని సిఎం కెసిఆర్ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గంలో 17,600 పైగా కుటుంబాలకు దళితబంధు ఇస్తా అన్నారు కానీ ఇంకా పూర్తిగా అందలేదన్నారు. 3000 కుటుంబాలకు అసలే రాకపోగా చాలా కుటుంబాలకు రెండవ విడత అందలేదన్నారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దళితబంధు డబ్బుల నుండి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు లంఛం తీసుకుంటున్నారని స్వయంగా సిఎం చెప్పారన్నారు. ప్రతికలో, ప్రతిపక్షాలో ఆరోపణ చేయలేదని, వారి పార్టీ ఎమ్మెల్యే మీద ఆయనే ఆరోపణ చేస్తున్నారన్నారు.

ఇది పేదల డబ్బు వారి డబ్బు తీసుకోవడం నేరమని, జుగప్పాకరం, ఆ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే ఆ ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలన్నారు. ఆ బాధితులకు డబ్బులు వాపస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. దళితులందరికి ఈ పథకం అందేలా చూడాలన్నారు. ఇది అస్తవ్యస్తంగా మారిందని, కంట్రోల్ తప్పింది అనడానికి ఇంతకన్నా ఎద్ద నిదర్శనం ఏం కావాలన్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, లాండ్ మాఫియా ఇప్పుడు ఇది వీటిని అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎమ్మెల్యేలను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
డైవర్లకు ఎల్లప్పుడు అండగా ఉంటా…
డైవర్లకు ఎల్లప్పుడు అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ సేవా ఆల్ టాక్సీ డైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న డైవర్స్‌కి రూ. 5 లక్షల ప్రమాద బీమా కార్డులను అందించారు. ఈ ప్రమాద భీమా అసోసియేషన్ కాకుండా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొని వస్తా అని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి సంపత్‌రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గణపతిరెడ్డి, గౌరవ సలహాదారులు రాజశేఖర్‌రెడ్డి, హుజురాబాద్ అధ్యక్షుడు మేకల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News