Monday, December 23, 2024

అధికారులు పిచ్చి వేషాలు బంద్ చెయ్యాలి: ఈటెల రాజేందర్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: బొమ్మరాశిపేట రైతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి రైతుకుల సంఘీభావం తెలిపారు. సర్వేనంబర్ 323లోని భూముల కోసం బొమ్మరాశిపేట వాసులు ఆందోళనకు దిగారు. 50ఏళ్లుగా ఉంటున్న భూములను ప్రభుత్వం తీసుకుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. భూముల కోసం ధర్నా చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులను అరెస్ట్ చేసి జైలులో పెట్టడంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50ఏళ్ల క్రితం రైతులు కొనుకున్న భూములను కజ్జా చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. రైతుల భూములను కెసిఆర్ బంధువులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతుల కొంపలు ముంచేందుకే ధరణి తెచ్చారని ఈటల ఆరోపించారు. రెవెన్యూ అధికారులు ఉన్నది పేదల కోసమా? దళారుల కోసమా? అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News