Monday, January 20, 2025

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారునికి వివాహానికి హాజరైన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారునికి వివాహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరైన సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తమ నియోజకవర్గం, కామారెడ్డిలో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సిఎంను స్వాగతిస్తూ, పెండ్లి కి హాజరైన కామారెడ్డి నియోజక వర్గ ప్రజలు, యువత హర్షాతిరేకాలతో కేరింతలతో స్వాగత నినాదాలు ఇచ్చారు.

” సిఎం కెసిఆర్ రావాలి” “స్వాగతం కామారెడ్డికి స్వాగతం” “కెసిఆర్ రావాలి కెసిఆర్ కావాలి” “జై కెసిఆర్.. దేశ్ కీ నేత కెసిఆర్” అనే నినాదాలతో పెళ్లి ప్రాంగణం దద్దరిల్లింది. వారికి కరచాలనం చేస్తూ, ఫొటోలకు అవకాశమిస్తూ, దారి పొడవునా అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ అధినేత ముందుకు సాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News