Friday, December 20, 2024

ఇండ్లను కూల్చేందుకు వచ్చిన అధికారులపై ఎమ్మెల్యే గాంధీ ఫైర్

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : ప్రభుత్వం కల్పించిన జిఓ. నెం.59 ప్రకారం ఇండ్లను క్రమబద్దీకరించుకోని పలువురు నివాసితులపై శనివారం కూకట్‌పల్లి తహశీల్ధార్ అధికారు, సిబ్బంది ఒక్కసారిగా జెసిబిలతో వచ్చి ఇండ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సంఘటనా స్ధలానికి చేరుకుని తాహశీల్ధా ర్ అధికార, సిబ్బందిపై మండిపడి వారిని అక్కడి నుంచి పంపివేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులకు సరైన అవగాహన లేకపోవడం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండ సొంత నిర్ణయాలతో చేపడుతున్న పనులతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆగ్రహించా రు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేదలు లబ్ధి పొందాలని ఎంతో అలోచించి జిఓ.59తో ఇండ్లను రెగ్యులరైజేషన్ చేసుకుని ఇతరులపై ఆధార పడకుండా బ్యాంక్‌ల ద్వారా లోన్ సదుపాయాలను పొంది వారి పిల్లల చదువులకు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి ఆర్ధికంగా ఎద గే మార్గాలను రూపొందించి అవకాశాలను కలిగిస్తునాన్నారు. అయితే సరైన అవగాహన లేని సంబంధిత సిబ్బంది చేస్తున్న పొరపాట్లు ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాయన్నారు. ముఖ్యంగా పేదలు అధికంగా ఉండే పాపిరెడ్డినగర్‌లో గత తొమ్మిది సంవత్సరాలుగా రెగ్యులరైజేషన్ రుసుము చెల్లింపులో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇటీవల కాలంలో తాహశీల్ధార్ అధికారులు బ స్తీలోని పలువురు ఇండ్లకు నోటీసులు అంటించి కూల్చివేస్తామని ప్రకటించి చె ల్లిచని ఇండ్లను శనివారం కూల్చే ప్రయత్నం చేశారన్నారు.

అయితే పాపిరెడ్డినగర్‌లోని ఇండ్ల క్రమబద్దీకరణ రుసుము ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా రావడంతో స్ధానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 80,160 గజాలు కలిగిన నివాసితులకు ఒకరికి రెండు లక్షలు ఆపై, మరి కొందరికి 20, 30, 40లక్షల వరకు రావడంతో ప్ర జలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. అయితే ఇదే విషయాన్ని చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డితో చర్చించి సంబంధిత మంత్రితో కలి సి కలెక్టర్‌కు నివేదిక సమర్పించామని త్వరలేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. తా హశీల్ధార్ అధికారులు, సి బ్బం ది ప్రజలకు ఇబ్బందులు కలిగి స్తే చూస్తూ ఊ రుకునే ప్రసక్తే లేదన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇండ్ల యజమానులు భయపడాల్సిన అవసరం లేదని రుసుము చె ల్లింపులో ప్రతీ ఒక్కరికి న్యా యం జరిగేలా చూస్తానని ఈస ందర్భంగా గాంధీ హామీనిచ్చా రు. ఎ లాంటి సమస్య ఉన్న త న దృష్టికి తీసుకు రావాలని గాంధీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News