Monday, December 23, 2024

మున్సిపల్ సిబ్బందిని సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మున్సిపల్ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధిని చాటి చెబుతూ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపారన్నారు.

అనంతరం భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లకు, సానిటరీ, మున్సిపల్ సిబ్బందికి గౌరవ ప్రదంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్, అసిస్టెంట్ కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News