Thursday, January 23, 2025

బెతేస్తా ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే గండ్ర

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌కాలనీలోని బెతేస్తా ప్రార్థన మందిరంలో తెలంగాణ అవతరణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో జరుగుతున్న 22రోజుల కార్యక్రమంలో నేడు ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో, ప్రార్థన మందిరాల్లో, చర్చ్‌లలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుపుకుంటున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి హిందువులకు దసరా పండగ, ముస్లింలకు రంజాన్ పండగ, క్రైస్తవులకు క్రిస్మస్ పండగలను రాష్ట్ర పండగలుగా నిర్వహించుకుంటు సగర్వంగా పండగ కానుకలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు ప్రభుత్వం, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతిల యొక్క కుటుంబం గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, మైనార్టీ అధికారి బుర్ర సునీత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్‌గౌడ్, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, జడ్పి వైస్ చైర్మన్ కళ్లెపు రఘుపతి శోభ, మేకల సంపత్, హనుమాన్ టెంపుల్, గుడి చైర్మన్ గడ్డం కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, దార పూలమ్మ, బిబి చారి, వజ్రామణి, కోఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News