Monday, December 23, 2024

ప్రారంభానికి ముస్తాబైన నిజామాబాద్ ఐటి హబ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా త్వరలో నిజామాబాద్ న్యూ కలెక్టరేట్ రోడ్డులో నిర్మిస్తున్న ఐటి హబ్‌పనులను నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ గణేష్ బిగాల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి హబ్‌పనులను గతంలో భూమిపూజ చేసి పనులను మంత్రి కెటిఆర్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిజామాబాద్ ఐటి హబ్ మారుతుందని ఆయన ఆకాంక్షించారు. సరికొత్త ఆలోచనలతో వచ్చే వారిని ఇన్వెస్టర్ గా మార్చడమే లక్ష్యంగానే కాకుండా గ్రామీణ ప్రాంతాల యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ ఐటి హబ్‌ద్వారా పత్యక్షంగా 765 మందికి ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా నాలుగు రెట్లు యువతకి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించి యువతకి ఉపాధి కల్పించడమే ప్రథమ లక్ష్యంగా దీన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటి హబ్ కి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా ప్రత్యేక పోలీస్ ఔట్‌పోస్టును కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాను విదేశాల్లో పర్యటించినప్పుడు 8 విదేశీ కంపెనీలు నిజామాబాద్ ఐటి హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి రంగాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి వర్యులు కెటిఆర్ సంకల్పించారని, ముఖ్యంగా నిజామాబాద్ యువతకు ఉపాధి కల్పించి వారిలో ఉన్న సరి కొత్త ఆలోచనలకు ఐటి హబ్‌లు వేదికగా మార్చి మరింత మందికి ఉపాధి కల్పించాలనేది మంత్రి కెటిఆర్ ఆకాంక్షఅని అన్నారు. మంత్రి కెటిఆర్ సంకల్పం మేరకు విశాలమైన వాతావరణం లో ఐటి హబ్ ని నిర్మించినట్లు తెలిపారు. ఐటి హబ్ అంటే హైదరాబాద్, బెంగుళూర్ కాదని, తెలంగాణలోనే ద్వితీయ శ్రేణి నగరాలలో ఒకటైన నిజామాబాద్ గుర్తుకు వచ్చేలా మౌళిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. త్వరలోనే ఐటి హబ్‌ని మంత్రి కెటిఆర్ ప్రారంభించి స్థానిక యువతకి విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News