Sunday, January 19, 2025

ఏడుగుల్లా పోచమ్మ పాటల సీడిని విడుదల చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

- Advertisement -
- Advertisement -

జిన్నారం: పటాన్‌చెరు పట్టణంలోని ఏడుగుళ్ల పోచమ్మ తల్లి భక్తి గీతాల సిడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఘనంగా విడుదల చేశారు. ఎమ్మెల్యే సహకారంతో జానపద కళాకారుడు వడ్ల నాగేష్ ఆధ్వర్యంలో స్వయంగా రచించి ఆలపించిన బోనాల పాటలను ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాటలు అద్భుతంగా వచ్చాయని ఎమ్మెల్యే గాయకుడు నాగేష్ ను అభినందించారు. ఈ సందర్భంగా గాయకుడు నాగేష్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ షకీల్ సందీప్ రెడ్డి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News