Wednesday, January 22, 2025

“నేనే సరోజ ఉరఫ్ కారంచాయ్” టీజర్ లాంచ్  

- Advertisement -
- Advertisement -

సినిమా అంటే  వినోదాత్మకంగానే కాదు  ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలన్న ఆలోచనతో , గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా రచయిత  డా. సదానంద్ శారద S-3  క్రియేషన్స్ పతాకంపై  శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వం లో నిర్మించిన చిత్రం  ‘నేనే సరోజ ‘ఉరఫ్ కారంచాయ్ . శాన్వి మేఘన, కౌశిక్ బాబు  జంటగా నటించారు.  ఈ చిత్రం  టీజర్  శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ గారు  లాంచ్ చేశారు.  ఈ కార్యక్రమంలో  రచయిత,నిర్మాత  డా.సదానంద్ శారద‌,  దర్శకులు శ్రీమాన్ గుమ్మడవెల్లి, సంగీత దర్శకులు రమేశ్ ముక్కెర  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  శాసన సభ్యులు శ్రీ ముఠా గోపాల్ మాట్లాడుతూ   ” సామాజిక  అంశాన్ని  తీసుకొని  సినిమా  నిర్మించిన  దర్శక నిర్మాతలను  అభినందిస్తున్నా.. ఆడపిల్లను  ఒక చైతన్య  మూర్తిగా ..ప్రతిభావంతంగా టీజర్ లో చూపించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ  విద్యార్ధిని పాత్ర లో శాన్వి మేఘన  పవర్ ఫుల్ గా నటించింది..టీజర్, టైటిల్  ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  ఈ చిత్రం  విజయవంతమవ్వాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి  నా శుభాకాంక్షలు  తెలియజేస్తున్న ”  అన్నారు. దర్శకులు శ్రీ మాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ.. ” ఆడపిల్లల  మీద దాడి చేసే ఉన్మాదులకు..వివక్షత  చూపేవారికి   ‘ తాగిస్తం కారంచాయ్  ‘ అంటూ  గుణపాఠం చెబుతుంది.

ఈ చిత్రం లో   హీరోయిన్  సరోజ. మంచి  కంటెంట్ తో  పాటు  అన్ని వర్గాల  ప్రేక్షకులకు నచ్చే విధంగా,    కుటుంబ  సమేతంగా  చూసే చిత్రం ఇది“ అన్నారు.  రచయిత,నిర్మాత  డా సదానంద్ శారద  మాట్లాడుతూ…”వరంగల్ కోట వంటి  ఆహ్లాదకరమైన  చారిత్రక ప్రదేశాలు…హృద్యమైన సంగీతం.. ఆలోచనాత్మక సంభాషణలు..శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు..ఆర్. యస్.  నంద హాస్యం  ఈ చిత్రానికి  ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల  సెన్సార్  పూర్తయి  ‘U ‘  సర్టిఫికెట్ పొందిన మా చిత్రం  టీజర్  ఆవిష్కరించిన  ఎమ్మెల్యే  శ్రీ  ముఠా గోపాల్ గారికి ధన్యవాదాలు“ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News