Monday, January 20, 2025

ఎంఎల్ఎ గోరంట్ల బుచ్చయ్య పిఎపై దాడి….

- Advertisement -
- Advertisement -

రాజమండ్రి: రాజమహేందరవరం గ్రామణ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిఎ చంద్రశేఖర్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎంఎల్‌ఎ బుచ్చయ్య దగ్గర వ్యక్తిగత పిఎ చంద్రశేఖర్ పని చేస్తున్నాడు. తన ఇంటి నుంచి బుచ్చయ్య ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ బాబు చంద్రశేఖర్‌ను ఆపాడు. దీంతో ఇద్దరు గొడవ జరగడంతో కానిస్టేబుల్ బైక్ నంబర్‌ను ఫోటో తీశారు. ఎందుకు తీశావని కానిస్టేబుల్‌ను చంద్రశేఖర్ ప్రశ్నించాడు. సెల్‌ఫోన్‌ను చంద్రశేఖర్ లాక్కుండగా అది కిందపడిపోయింది. కోపంతో ఊగిపోయిన కానిస్టేబుల్ వాకీటాకీ సెట్‌తో చంద్రశేఖర్‌పై నుదురు, చెవి వెనుక భాగంలో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావం కావడంతో వెంటనే అతడిన ఆస్పత్రికి తరలించారు. ఎంఎల్‌ఎ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సదరు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాంగ్ రూట్‌లో వస్తుండగా కానిస్టేబుల్ ఫోటో తీశాడని, ఈ నేపథ్యంలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి విజయ్‌పాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News