Thursday, January 23, 2025

నూతన భవనాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గువ్వల

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : పట్టణంలో నూతనంగా 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎల్‌ఐసి భవనానిక, 5 లక్షలతో నిర్మించనున్న గంగిరెద్దుల భవన నిర్మాణాలకు శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంబంధిత నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలోని అన్ని కులాల వారికి సమన్యాయంతో ప్రతి కమ్యూనిటి పరంగా భవనాలతో పాటు ఉన్నతికి తోడ్పాటు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ నరసింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు, ఎల్‌ఐసి మేనేజర్ వెంకన్న, డిఈఓ ప్రదీప్, వీరేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News