హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో బిఆర్ఎస్ ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పలువురు బిఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారు. కొద్దిసేపటిక్రితమే హరీశ్ రావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు ఇంటికి పోలీసులు వెళ్లి ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే, మాజీ మంత్రి కెటిఆర్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాడి కౌశిక్ రెడ్డి గొడగకు దిగారు. దురుసగా ప్రవర్తించడంతో ఆయనను పోలీసులు బయటకు లాక్కెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిని సామవారం రాత్రి కరీనంగర్ పోలీసులు అరెస్టు చేశారు.