Thursday, January 23, 2025

సిఎం రేవంత్‌రెడ్డికి ఎంఎల్‌ఎ హరీశ్‌రావు లేఖ

- Advertisement -
- Advertisement -

రైతులకు తక్షణమే రూ.2లక్షల రణమాఫీ చేయాలని బిఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారని, నాలుగు నెలలవుతున్నా ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేదని విమర్శించారు. రైతులకు బ్యాంకులు నోటీసుల మీద నోటీలు ఇస్తూ కిస్తీ చెల్లింలచాలంటున్నాయని, తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుకున్నారని తెలిపారు. అందువల్ల రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయని, ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయని అన్నారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయని, దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నదని చెప్పారు. తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం అని, వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు 70 శాతం వరకు ఉన్నాయని పేర్కొన్నారు.

అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులను గోస పెట్టడం ఏమాత్రం సమ్మతం కాదని.. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాట మీకు తాను గుర్తు చేయాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు. రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించే విధంగా..ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై 500 రూపాయల బోనస్, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంటపొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలని సిఎంకు రాసిన లేఖలో హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News