Friday, January 10, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేయండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫో న్లను ట్యాప్ చేయించారని సిద్ధిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి, కాంగ్రెస్ నేత గదగోని చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు, విశ్రాంత పోలీసు అధికారి రాధాకిషన్‌రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 1వ తేదీన పోలీసులు 120(బి), 386, 409,506 సెక్షన్ల కింద, అలాగే రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ ప్రకారం ఆదివారం కేసు నమోదైంది. ఎన్నికల సమయం లో హరీశ్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబసభ్యులకు చెందిన 20 ఫోన్లను ప్రణీత్‌రావు సహాయంతో ట్యాప్ చేశారని చక్రధర్‌గౌడ్ ఆరోపించారు. తాను అ ప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.కోర్టులో రిట్ పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాలతోనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.

‘రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్’
రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్ట కుండా, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో హరీశ్‌రావు కోరారు. ఈ నేపథ్యంలో పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా రాజకీయంగా కీలకంగా వ్యవహరించడంతోపాటు 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారని పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే హరీశ్‌రావుపై ఫిర్యాదు చేశారని, పోలీసులు కూడా తగిన సాక్ష్యాధారాలు సేకరించకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా, అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని మధ్యంతర అప్లికేషన్‌లో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News